ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ లైఫ్ స్టైల్ తెలిస్తే మ‌తిపోతుంది.

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ లైఫ్ స్టైల్ తెలిస్తే మ‌తిపోతుంది.

0
91

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగానే ఉన్నారు, ఆయ‌న‌కి ఏమీ కాలేదు అని ఆ దేశ మీడియా క్లారిటీ ఇచ్చింది, అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఎలా ఉన్నారు అని అంద‌రూ కంగారు ప‌డ్డారు.. మొత్తానికి ఆయ‌న సేఫ్ అని తెలియ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు, అయితే ఆయ‌న లైఫ్ స్టైల్ చూస్తే చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ట‌.

అస‌లు ఆయ‌న‌కు ఎలాంటి రాజ‌కీయ అనుభవం లేకుండానే తండ్రి మరణానంతరం కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా అధికారం చేపట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక ఆయ‌న ఎక్కువ‌గా రక్షణశాఖ మంత్రులను మారుస్తూ ఉంటార‌ట‌.
2011 నుంచి ఇప్పటివరకూ కనీసం ఆరుగురు వ్యక్తులను మార్చారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు అన్నీ చాలా సీక్రెట్ గా ఉంచుకుంటారు.

కిమ్ భార్య పేరు రి సోల్ జు. ఆమెకు కూడా చాలా ఆంక్షలు విధించారు కిమ్. ఆమె బ‌య‌ట‌కు పెద్దగా క‌నిపించ‌రు. ఆయ‌న ఫుల్ కాస్ట్ లీ ఫుడ్ తీసుకుంటారు సిగ‌రెట్ మ‌ద్యం అల‌వాటు ఉంది. మ‌ద్యం విదేశాల నుంచి తెప్పించుకుని తాగుతారు. అమెరిక‌న్ లిక్క‌ర్, జ‌ర్మ‌న్ వైన్ బాగా తాగుతారు.. తనకు ఎంతో ఇష్టమైన పంది మాంసాన్ని తరుచుగా డెన్మార్క్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు. అలాగే బ్రెజిలియన్ కాఫీ కోసం ఏకంగా 21 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇలా త‌న‌కు కావ‌ల‌సిన వాటి కోసం ఎంత అయినా ఖ‌ర్చు చేస్తారు కిమ్.