కరోనా ఈ ప్రపంచాన్ని ఏడాదిగా వణికిస్తోంది, ఎప్పుడు టీకా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే రష్యా,చైనా ఇప్పటికే తమ దేశంలో టీకాని తీసుకువచ్చాయి.. కొందరు ఈ టీకాపై విమర్శలు చేశారు మరికొందరు ఈ టీకా బాగానే పని చేస్తోంది అని అన్నారు. కొన్ని దేశాలు ఈ టీకాని పరిశోధన చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ దేశంలోకి కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, అయితే ఇప్పుడు ఆయన ఈ టీకా తీసుకున్నారు అని తెలుస్తోంది…కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్ ను వేయించుకున్నారని తెలుస్తోంది.
దీనిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి, అయితే చైనాలో చాలా టీకాలు ఇప్పుడు వచ్చాయి మరి ఆయన ఏ టీకా తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక చైనా టీకా తీసుకున్నారు అనే వార్తలపై ఎక్కడా ఆయన స్పందించలేదు. అక్కడ అధికారులు చెప్పడం లేదు కాని అంతర్జాతీయంగా ఈ వార్త వైరల్ అవుతోంది.