కిమ్ లేక‌పోతే ఉత్త‌ర‌కొరియా బాధ్య‌త‌లు స్వీక‌రించేది ఎవ‌రో తెలుసా?

కిమ్ లేక‌పోతే ఉత్త‌ర‌కొరియా బాధ్య‌త‌లు స్వీక‌రించేది ఎవ‌రో తెలుసా?

0
92

గ‌త మూడు రోజుల నుండి ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం బాగాలేద‌ని ఆయ‌నకు సీరియ‌స్ గా ఉంద‌ని ఆయ‌న ‌కండిష‌న్ గురించి అందుకే ఆ దేశ మీడియాకి స‌ర్కార్ ఏ విష‌యం చెప్ప‌డం లేదు అని వార్త‌లు వినిపిస్తున్నాయి, ఇక నేష‌న‌ల్ మీడియా సైలెంట్ గా ఉండ‌టంతో అక్క‌డ విష‌యాలు ఏమీ తెలియ‌డం లేదు అని అన్నీ దేశాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

అయితే ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు అని తాజాగా తెలుస్తోంది, ఒక వేళ కిమ్ కు ఏదైనా జరిగితే అప్పుడు ఆదేశ పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయనే ప్రశ్న ప్రతి వారిలో కలుగుతుంది.. ఇప్ప‌టికే ఆయ‌న‌కు నియంత అనే పేరు ఉంది, మ‌రి ఆయ‌న‌లా ఎవ‌రైనా వ‌స్తారా లేదా ఇంకా క‌ఠినంగా ఉంటారా, లేదా సౌమ్యంగా ఉంటారా అనేది పెద్ద ప్ర‌శ్న‌.

కిమ్ చిన్న చెల్లెలు కిమ్ యో జోంగ్ ఆ దేశ అధ్య‌క్ష పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కిమ్ కంటే దారుణం అని అంటున్నారు, ఈ మ‌ధ్య జాతీయ రాజ‌కీయాల్లోకి ఆమె ఎంట‌ర్ అయ్యార‌ట‌, ముందు జాగ్ర‌త్త‌గా ఆమెని రంగంలోకి దించాడు కిమ్ అని తెలుస్తోంది… కిమ్ కు సోద‌రి అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. అక్క‌డ దేశంలో ఆమెని ప‌వ‌ర్ ఫుల్ ఉమెన్ అని కూడా పిలుస్తారు.