రాష్ట్రపతి భవన్‌లో సోమవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా కేంద్రం పలు విభాగాల్లో 128 పద్మ అవార్డులను ప్రకటించగా..రెండు విడుతల్లో అవార్డులను ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే సోమవారం కొద్ది మందికి మాత్రమే అవార్డులు అందజేశారు.