కిర‌ణ్ బేడీ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫైర్ ఎందుకంటే

కిర‌ణ్ బేడీ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫైర్ ఎందుకంటే

0
85

కిర‌ణ్ భేడీ అంటే తొలిమ‌హిళా ఐపీఎస్ ఆఫీస‌ర్ గా మ‌న దేశంలో ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు,
ఇక ఇప్పుడు ఆమె పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా సేవ‌లు అందిస్తున్నారు ఖ‌ర్చులు ఆర్బాటాల‌కు దూరంగా ఉంటారు ఆమె.. ఎక్క‌డైనా ఫంక్ష‌న్లకు వెళ్లినా అక్క‌డ శాలువాలు, పూల బుకేలు కూడా ఆమె తిర‌స్క‌రిస్తారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు పెను వైరల్ అవుతోంది. కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢ నమ్మకంతో మనం వాటిని పడేస్తున్నాం.. అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడి పిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావమని ఓ వీడియో ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

దీనిపై చాలా మంది నెటిజ‌న్లు అస‌లు వాస్త‌వం తెలుసుకోకుండా ఇలా ఎలా పోస్ట్ చేస్తారు అని ప్ర‌శ్నించారు. ప్రజలు తిని, పారేసే గుడ్లు ఎలా కోడిపిల్లలుగా మారతాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తినడానికి ఉపయోగించే కోడిగుడ్లు పిల్లలను ఎలా పొదుగుతాయని నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో ఆమె ఈ ట్వీట్ డిలీట్ చేశారు.