మందికి పుట్టిన బిడ్డను..మా బిడ్డ అని ముద్దాడుతారా?: KCR

0
76

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీని కూకటివేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తామని అన్నారు. మందికి పుట్టిన బిడ్డను..మా బిడ్డ అని ముద్దాడుతారా అంటూ ఓ సంఘటన గురించి చెప్పారు. కేసీఆర్ కిట్ అనే ఓ పథకం ఉంది. సిగ్గున్నోడు ఎవడైన ఇది మా పథకం అని చెప్పుకుంటాడా? సిగ్గు కూడా లేదా ఛీ ఛీ..అందులో 6 వేల రూపాయలు మావే అని చెప్పుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డను..మా బిడ్డ అని ముద్దాడుతారు ఈ బీజేపీ వాళ్లని చురకలు అంటించారు.