Breaking: అమిత్ షా..ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

0
130

నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బిజెపిని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నానని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ మద్దతుతో బిజెపిను బలపరచుకోవడానికే అమిత్ షా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని అన్నారు. పాన్ ఇండియా స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ తో బిజెపి దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేదని డిల్లీలో మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని పేర్కొన్నారు.