కోడెల రాజకీయ ప్రస్థానం ముగిసింది ఇలా…

కోడెల రాజకీయ ప్రస్థానం ముగిసింది ఇలా...

0
86

సొమవారం హైదరాబాద్ లో ఉన్న తన నివాసంలో కుటుంబ సభ్యులులేని సమయంలో ఉరి వేసుకున్నారు టీడీపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు… విషయం తెలుసుకున్న సెక్యురిటీ సిబ్బంది హూటా హూటీన ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త విన్న టీడీపీ నాయకులు పలు ఆరోపణలు చేసున్నారు.. కొన్నిరోజులుగా కేసులు చుట్టుముట్టడంతో రాజకీయ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కుటుంబ సమస్యల కారణంగా ఆయన ఆత్యహత్య చేసుకున్నారని అంటున్నారు… గతంలో కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నిద్ర మాతర్లు వేసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

కాగా కోడెల శివప్రసాదరావు (1947 మే 2 ౼ 2019 సెప్టెంబరు 16 ఆంధ్ర ప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి. 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు అప్పట్లో గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ కోడెల ఆయన దృష్టిలో పడ్డాడు. అతను పోటీ చేయటానికి ఇష్టపడక పోయినప్పటికీ, నందమూరి తారకా రామారావు 1983 లో ఎన్నికలలో పోటీ చేయటానికి ప్రేరేపించారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల.2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు.
డాక్టర్ కోడెల రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి విజయం సాదించాడు.

నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
కోటప్పకొండను అభివృద్ది చేయడంలో భాగంగా ఎన్నో నిధులు మంజూరు చేయి౦చి, ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాన్ని సుందర సౌందర్యముగా అభివృద్ధి చేయడమే కాకుండా, పరమ శివుడే మేధో దక్షిణామూర్తి గా వెలిసిన క్షేత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థితి పొండుతారనే భావంతో, ఈ జ్ఞానప్రదాత సన్నిదిని ఓ సామూహిక అక్షరాభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దుటంతో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. సామూహిక అక్షరాభ్యాస సమయంలో ప్రతి బాలుడికి పెద్దబాలశిక్ష, మేధో దక్షిణామూర్తి రూపులు, కంకణాలు అందిస్తారు.డాక్టర్ కోడెల… కాకలు తీరిన తెలుగుదేశం సీనియర్ నాయకులు. గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుగాంచి, అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్పూర్తి ప్రదాతగా ఉన్నారు. అభివృద్ధితోనే అంతరాలు తోలుగుతాయని భావిస్తారు డాక్టర్ కోడెల.

గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని డాక్టర్ కోడెల శివప్రసాదరావు జన్మభూమిపై మమకారంతో గ్రామస్తులు మరియు దేశ విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” నినాదంతో గ్రామస్తులందరూ కలసి మెలసి ఒక ప్రణాళికను రూపొందిచుకుని, ముందు ఊరికి గల లోటుపాట్లను ఒక క్రమ పద్దతిలో రాసుకుని, తర్వాత ఒక్కొక్కటిగా పనులను మొదలు పెట్టడానికి ప్రేమ ఆప్యాయతలతో ఓ ప్రత్యేక ఆత్మీయ సమావేశంను “పల్లెకు పోదాం…” అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా జరుపుతారు.