Breaking: బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

0
85

తెలంగాణ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన చేరికపై క్లారిటీ ఇచ్చారు. నేను అమిత్ షాను కలిసింది వాస్తవమే కానీ పార్టీలో చేరిక గురించి కాదు. నేను పార్టీ మారాలనుకుంటే ముందు మునుగోడు ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో నేను గిట్టని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోవడం లేదని చెప్పారు. దీనితో ఆయన బీజేపీలో చేరేది లేదని కాంగ్రెస్ లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చినట్లైంది.