రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్..నన్ను రెచ్చగొట్టొద్దు అంటూ..

0
88

తెలంగాణాలో రాజకీయం రోజుకో రంగు పులుముకుంటుంది. ఎవరూ ఊహించని విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తలదూర్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిసారిగా స్పందించారు.

ఈ సందర్బంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ..రాజ్ గోపాల్ రెడ్డి ఆయనకు ఇష్టమున్న పార్టీలోకి వెళుతున్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన ‘కోమటిరెడ్డి బ్రాండ్’ కామెంట్లపై వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్‌ తప్పుగా మాట్లాడారు. మేం చాలా నిజాయితీగా ఉన్నాం. మమ్మల్ని అవమానించాలని చూస్తున్నారా? మీరు అని సంభోదించడం ఏంటి? రేవంత్‌రెడ్డి గారూ నన్ను రెచ్చగొట్టొద్దు.. టీడీపీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌లో చేరావ్‌ అంటూ రేవంత్‌రెడ్డికి చురకలంటించారు.