కరోనా వైరస్ ఇప్పటికే చాలా మంది ప్రాణాలు హరిస్తోంది.. చైనా నుంచి ఇది దాదాపు 20 దేశాలను వణికిస్తోంది… అయితే ఈ వైరస్ మన భారత్ లో కూడా సోకింది.. ఇప్పటికే కొందరికి ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు, తాజాగా ఈ సమయంలో కరోనా వైరస్ తో పాటు మరో వైరస్ మన కోనసీమని వేధిస్తోందట.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ను లంపీ స్కిన్ గా పిలుస్తున్నారు. వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. దీని వల్ల పాడి సంపదకు ఎఫెక్ట్ పడుతోంది అంటున్నారు…అందులో ఇరవై ఆవులు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.
ఉత్తరాది నుంచి కోనసీమకు ఈ వైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. అక్కడ ఆవులకి ఇప్పటికే కొన్నింటికి ఈ వైరస్ సోకిందట… ఇక్కడకు తీసుకువచ్చిన ఆవుల ద్వారా అది వ్యాప్తి చెంది ఉంటుంది అంటున్నారు.