కొత్త ఏడాది వచ్చేస్తోంది ఇక కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది.. దీంతో అనేక కొత్త పథకాలు కొత్త స్కీమ్స్ కూడా కొత్త ఏడాదికి సిద్దం అవుతూ ఉంటాయి, తాజాగా కేంద్రం బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అవి జనవరి ఒకటి నుంచి 2020 నుంచి అమలు చేయనున్నారు మరి అవి ఏమిటో చూద్దాం.
జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైప్ సర్టిఫికెట్ను ఇవ్వకపోవడం వల్ల పింఛను కోల్పోతారు చాలా మంది మరి అలా ఇక భయపడనవసరం లేదు . ఇలా ఇవ్వని ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ వో తీపికబురు చెప్పింది. లైఫ్ సర్టిపికెట్ ఇవ్వని వారికి పింఛను ఇవ్వకపోవడాన్ని నిలిపివేయాలని ఈపీఎఫ్ఓ ఉత్తర్వులను జారీ చేసింది. సరైన కారణాలను తెలిపి మళ్లీ సర్టిఫికెట్ ఇస్తే వారికి ఫించన్ ఇవ్వనున్నారట.డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాలి అని చెబుతోంది సంస్ధ.
ఇకపై బంగారు ఆభరణాలకు హల్ మార్క్ తప్పని సరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త రూర్స్ ప్రకారం బంగారం ఆభరణాలకు 14, 18, 22 కారట్లలో హాల్మార్కింగ్ ఉంటుంది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనుంది కేంద్రం, సో బంగారం కొనేవారు కచ్చితంగా హల్ మార్క్ చూసుకోవాల్సిందే.హల్ మార్క్ లేని అమ్మకాలు వారు చేసినా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
ఇక మీ పాత డెబిట్ కార్డులని క్లోజ్ చేస్తున్నాయి బ్యాంకులు, కస్టమర్లకు కొత్త ఈ ఎంవీ చిప్ కార్డులు బ్యాంకులు అందిస్తున్నాయి… కస్టమర్లు అందరూ తప్పని సరిగా డిసెంబర్ 31 లోపు మీ బ్యాంకులని సంప్రదించి కొత్త కార్డులు తీసుకోవాలి అని బ్యాంకులు తెలియచేశాయి.. దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. మీరు పాత కార్డులు వాడితే అవి జనవరి 1 నుంచి పనిచేయవు.
మీ పాన్ కార్డుని ఆధార్ కార్డుకి లింక్ చేయాలి ..లేకపోతే మీ పాన్ కార్డుని క్లోజ్ చేస్తుంది కేంద్రం .దీనికి కూడా జనవరి 1లోపు వరకూ సమయం ఇచ్చారు.