ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రముఖులు ఏమన్నారంటే

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రముఖులు ఏమన్నారంటే

0
91

హస్తిన పీఠం మరోసారి కేజ్రీవాల్ సొంతం చేసుకున్నారు.. 70 సీట్లు ఉన్న హస్తిన అసెంబ్లీలో అరవై సీట్లలో ఆప్ పార్టీ దూసుకుపోతోంది..సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ త్వరలో ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు, ఇక ఆయన న్యూ డిల్లీ నియోజకవర్గం నుంచి 13508 ఓట్లతో గెలుపొందారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజయంతో పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి.. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కూడా ఆయనని అభినందించారు..ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ కు హృదయపూర్వక శుభాభినందనలు అంటూ జగన్ ట్వీట్ చేశారు. మీ పదవీకాలంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్ లో కోరుకున్నారు సీఎం జగన్.. ఇక సీనియర్ లీడర్ బీహర్ సీఎం నితీష్ కూడా స్పందించారు..జనతా మాలిక్ హై ఓటర్లే రాజులు అంటూ అభినందించారు.

ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్…. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ఫోన్లో ఆయనని అభినందించారు, కేరళ సీఎం విజయన్, తమిళనాట డీఎంకే నేత స్టాలిన్ కూడా ఆయనని ఫోన్లో అభినందించారు.