కేజ్రీవాల్ కుమార్తె గురించి మీకు తెలియని విషయాలు

కేజ్రీవాల్ కుమార్తె గురించి మీకు తెలియని విషయాలు

0
112

ఢిల్లీ పీఠాన్ని సామాన్యుడు మరోసారి సొంతం చేసుకున్నాడు. ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ ఈ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆప్ ఎన్నికల్లో విజయం సాదించడంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే కాదు ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహలు కూడా బాగా ఉపయోగపడ్డాయి ..చివరకు ఇంత ఘన విజయం వచ్చింది, ఇక కేజ్రీవాల్ చివరి ఏడాది ప్రవేశ పెట్టిన పథకాలు కూడా ప్రలకు దగ్గర చేశాయి.

ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే తో పాటు.. ఆయన కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని భుజానెత్తుకున్న కేజ్రీవాల్ కుమార్తెను కూడా చాలా మంది అభినందిస్తున్నారు..ఆమె కూడా తండ్రి విజయానికి ఎంతో కృషి చేసింది.

కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ఢిల్లీ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక పెద్ద కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి గా పని చేస్తున్నారు. అందరితో చాలా సరథాగా సాధాసీదాగా ఉంటారు ..హంగా ఆర్బాటాలు ఆమెకు ఉండవు.. ఇప్పటికీ ఉద్యోగం అలాగే చేస్తున్నారు, అయితే ఎన్నికలకు ఐదు నెలలముందు ఉద్యోగానికి లీవ్ పెట్టి పార్టీ కోసం పని చేశారు. సోషల్ మీడియాలో పార్టీకోసం ప్రచారం చేశారు.. ప్రత్యర్దుతు తన తండ్రి పై పార్టీపై విమర్శలు చేస్తే ఆమె వాటిని తిప్పికొట్టేవారు. ఇప్పుడు తండ్రి విజయం వెనుక ఆమె కృషి కూడా ఉంది అని చాలా మంది ప్రశంసిస్తున్నారు.