నేడు కృష్ణయ్య అంత్యక్రియలు..పుట్టెడు దుఃఖంలో కుటుంబ సభ్యులు

0
107

టీఆర్ఎస్ నేత దారుణ హత్య తెలంగాణ వ్యాప్తంగా అందరిని కలచివేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడైన తమ్మిన్ని కృష్ణయ్యను ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తులు, కొడవళ్లతో అతి కిరాతకంగా నరికిచంపారు.

పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసి బైక్ పై వెళ్తున్న కృష్ణయ్యను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు దుండగులు. ఈ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కృష్ణయ్య హత్య నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు కృష్ణయ్య అంతిమయాత్రలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి పాల్గొననున్నారు.