నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో బొణిగెల ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనాకు ఇస్తున్న మందుపై విషపురుగుల దాడి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కార్పొరేట్ మెడికల్ మాఫియా కేంద్రంగా జరుగుతున్న ఈ దాడిలో కొన్ని విషకీటకాలు ప్రత్యక్షంగా మరికొన్ని కీటకాలు పరోక్షంగా ఆనందయ్య మందుపై దాడి చేస్తూనే ఉన్నాయి. కార్పొరేట్ మెడికల్ మాఫియాకు కొన్ని మీడియా సంస్థలు కూడా వంతపాడుతూ విషం జల్లుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము.
ఈ పరిస్థితుల్లో ఆనందయ్య మందు విషయంలో ఈ విషపురుగులు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచే వస్తున్నాయి. ఆ ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం.
ఆనందయ్య మందు వికటించిన దాఖలాలున్నాయా?
80వేల మందికి మందు ఇస్తే ఎవరి నుంచైనా కంప్లెంట్ ఉందా?
జనాల నుంచి భారీగా డబ్బు గుంజే ప్లాన్ తోనే ఆనందయ్య మందు ఇస్తున్నాడా?
ఆనందయ్య మందులో ఏమైనా హానికారకమైన పదార్థాలు ఉన్నాయా?
ఆనందయ్య తయారు చేసే మందులో రహస్యం ఏమైనా దాగి ఉందా?
కంట్లో మందు వేస్తే ఊపిరితిత్తులు పనిచేయడం ఏంటి అని ప్రశ్నించే మూర్ఖులు అసలు కంటికి ముక్కుకు మధ్య సంబంధం గురించి తెలియదా?
అల్లోపతి వైద్యంలో ప్లాస్మా థెరపీ ఎందుకు చేశారు? ఎందుకు బంద్ పెట్టారు?
రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఎందుకు వాడారు? తర్వాత ఎందుకు బంద్ పెట్టారు?
క్లోరోక్విన్ మందును ముందు ఎందుకు ఇచ్చారు? తర్వాత ఎందుకు రద్దు చేశారు?
ఇలాంటి ప్రశ్నలన్నీ సామాన్య ప్రజలు సదరు సోకాల్డ్ విషపు మనుషులను అడుగుతున్నారు. పొరపాటున ఆనందయ్య మందు ఇవ్వడం కొనసాగిస్తే కార్పొరేట్ ఆసుపత్రులు ఖాళీ అవుతాయేమో అన్న భయంతో మెడికల్ మాఫియా తెర వెనుక ఉండి కొన్ని టివి ఛానెళ్లను ఉంచుకొని బరిగించి చేస్తున్న ఈ కుట్రలను ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు.
అసలు కరోనాకు ఇది మందు అని ఎవరూ చెప్పలేని ఈ పరిస్థితుల్లో ఏ చిన్న ఆధారం దొరికినా ప్రజలు దాన్ని పట్టుకుని కరోనాను జయించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో వారికి సహాయకారిగా తనకు చేతనైన ప్రయత్నం చేస్తున్న ఆనందయ్యను నిలువరించే ప్రయత్నం చేస్తే జరిగే నష్టం ఆయనకు కాదు కానీ సామాన్య ప్రజలకే. కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రయివేటు ఆసుపత్రులు గల్లె పెట్టలు నింపుకోవాలన్న దురాశతో ప్రజల రక్తపు కూడా బుక్కలు బుక్కలుగా తినాలన్న దురాలోచతో ఆనందయ్య మందుపై విష ప్రచారం చేస్తున్నారు.
కార్పొరేట్ మెడికల్ మాఫియా కుయుక్తులను అంతమొందించి తక్షణమే ఆనందయ్య కరోనా ముందును ప్రజలకు పంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు. ఇప్పటికే జనగ్ సర్కారు ఆ దిశగా కార్యాచరణ చేపట్టినట్లు కనబడుతున్నది. దాన్ని వేగవంతం చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.