కేటీఆర్ బ్లూ కలర్ షర్ట్ ఏమిటి అసలు రీజన్

కేటీఆర్ బ్లూ కలర్ షర్ట్ ఏమిటి అసలు రీజన్

0
98

రాజకీయాల్లో ఉన్నవారు చాలామంది ఖద్దర్ వైట్ అండ్ వైట్ లో మెరిసిపోతూ ఉంటారు, ఎక్కువగా మల్లెపువ్వు లాంటి తెల్లటి వస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ ట్రెండ్ ను కాస్త బ్రేక్ చేసింది చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత నుంచి మార్పులు వస్తున్నాయి. ఆయన పక్కా ఎల్లో డ్రెస్ వేసుకుని టీడీపీ అంటే ఎల్లో కలర్ అనేలా మార్చేశారు. ఇక వైయస్ జగన్ కూడా వైట్ డ్రెస్ తోనే కనిపిస్తారు.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన తన లుక్ ను మార్చుకోలేదు.

ఎప్పుడైనా విదేశీ పర్యటనల సమయంలో మాత్రం జగన్ లోని కుర్రాడు బయటకు వస్తాడే కానీ.. సాధారణ రోజుల్లో మాత్రం అందరిలో కలిసిపోయేలా ఆయన వస్త్రధారణ ఉంటుంది. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కూడా కలర్ షర్ట్ లు ధరించరు వైట్ షర్ట్ అండ్ లైట్ పింక్ షర్ట్ వేసుకుంటారు, ఇక విదేశీ పర్యటనల సమయంలో సూట్ వేస్తూ ఉంటారు, తాజాగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా వేసుకొచ్చిన బ్లూ కలర్ షర్ట్ కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.

దీని గురించే ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు. కాస్త ముదురు నీలం రంగు చొక్కా కు.. డిజైన్ తో ఉన్న వైనం రోటీన్ కు భిన్నంగా ఆయన్ను నిలిపిందని చెప్పాలి. అయితే ఆయన కూడా ఈ కలర్ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అని ట్రై చేసి ఉంటారు అని అంటున్నారు అభిమానులు,అంతేకాని దీని వెనుక సంధింగ్ ఏమీ లేదు అంటున్నారు.