తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో కచ్చితంగా గ్రేటర్ లో లాక్ డౌన్ పెడతారు అని వార్తలు వచ్చాయి, సీఎం కేసీఆర్ కూడా అవసరం అయితే లాక్ డౌన్ పెడతాము అని తెలిపారు, కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అన్నారు.
అయితే పది రోజులు అవుతోంది కాని దీనిపై తెలంగాణ సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత స్దితిలో లాక్ డౌన్ పెట్టే పరిస్దితి లేదు అని అన్నారు. ఇక లాక్ డౌన్ పెడితే ఆర్ధిక సమస్యలు ఎన్నో వస్తాయని, కరోనా కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తాయని ఆయన అన్నారు.
ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రి కేటీఆర్ తెలిపారు, మొత్తానికి తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ అని అందరూ అనుకున్నారు కాని దీనిపై క్లారిటీ అయితే వచ్చేసింది.