హీరోయిజం మానుకోమంటూ ఆ ఎమ్మెల్యే పై ఫైర్ అయిన కేటీఆర్ ..

హీరోయిజం మానుకోమంటూ ఆ ఎమ్మెల్యే పై ఫైర్ అయిన కేటీఆర్ ..

0
90
KTR

శాసనసభల్లో జీరో అవర్ కి చాల ప్రాముఖ్యత ఉంటుంది .అయితే ఇక్కడ ఒక సమస్య గురించి వచ్చిన చర్చలు గొడవల దాకా వెళతాయి .అయితే ఇప్పుడు అలంటి సంఘటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కి ,కేటీఆర్ కి మధ్య జరిగిందట .

జీరో అవర్ లో వచ్చిన చర్చల్లో భాగంగా మునుగోడు ,చండూరు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు . తెరాస వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల అభివృద్ధికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తుందంటూ అయన మంది పడ్డారు .

దీనికి కేటీఆర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరగకుండానే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది అంటూ కోమటిరెడ్డి కి కౌంటర్ ఇచ్చారు . అభివృద్ధి జరిగిందన్న మాట వాస్తవం , అరుస్తూ మాట్లాడినంత మాత్రాన జరిగిన అభివృద్ధి అవాస్తవమై పోదని కేటీఆర్ సమాధానమిచ్చారు .