మొత్తానికి తెలంగాణ రాజకీయాలు కూడా హీట్ పుట్టిస్తున్నాయి ఇఫ్పుడు కారు పార్టీ ప్రభుత్వ పాలన నడిపిస్తోంది కేసీఆర్ అయితే, పార్టీని మాత్రం నడిపిస్తుంది గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనే చెప్పాలి .. అయితే తాజాగా ఆయన దగ్గరకు నేతలు కూడా క్యూ కడుతున్నారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ గురించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు.
ఇప్పుడు యువత అంతా మంత్రి కేటీఆర్ వైపు చూస్తున్నారు అని కొత్త నాయకత్వం వైపు చూస్తోంది అని అన్నారు..కేటీఆర్లో ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, కేసీఆర్ తర్వాత ప్రభుత్వ పగ్గాలు ఆయనవేనని కామెంట్లు చేశారు. ఇవి టీఆర్ఎస్ నేతలని కూడా షాక్ కు గురిచేశాయి..బీజేపీ నేతలు మతం పేరుతో ప్రజల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, సెంటిమెంట్ను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రిని ఎవరైనా కలవవచ్చునని, ఇందుకు ప్రత్యేక కారణాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అసదుద్దీన్ ఒవైసీ నిన్న కేసీఆర్తో భేటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ సీఎం కుర్చీని త్వరలో కేటీఆర్ కు ఇస్తారు అని వార్తలు వస్తున్న వేళ తాజాగా ఆయన కామెంట్లు కొత్త అర్ధాలకు కారణం అవుతున్నాయి, అయితే కేటీఆర్ కూడా తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంత పేరు ప్రఖ్యాతలు గడించిన విషయం తెలిసిందే