భజన బ్యాచ్ కు షాక్ ఇచ్చిన కేటీఆర్

0
85

మామూలుగా పార్టీ సభలు అంటే ఆ హడావుడే వేరు. వచ్చిన జనాలను ఉత్తేజపరుస్తూ పాటలు, దానికి తగ్గ స్టెప్పులు వేస్తుంటారు. అంతేకాదు రాజకీయ నాయకులు వారి పేర్ల మీద ప్రత్యేకించి పాటలు రాయించుకొని పాడిస్తారు. దానితో జనం నోళ్లలో కొన్ని పాటలు ఇప్పటికి వింటూనే ఉంటాం. తాజాగా కేటీఆర్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే..తాజాగా రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముందు జై రామన్న జై జై రామన్న అంటూ సాయి చంద్ పాడుతుండగా కేటీఆర్ వద్దు వద్దు అంటూ తన దగ్గర ఉన్న మైక్ ను తీసుకుపోయాడు. అంతేకాదు ఆ పక్కనే కోరస్ ఇస్తున్న వారిని ఇక చాలు అంటూ చెప్పాడు. దీనితో వారు ఉన్నటుండి పాటను ఆపేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది. బాధ్య‌త వేరు భ‌జన వేరు..భ‌జ‌న జీవితాన్ని ఎటువైపు తిప్పుతుందో కానీ బాధ్య‌త  జీవితాన్ని మ‌రింత గొప్ప‌గా తీర్చిదిద్దుతుంది. సరిగ్గా ఇదే అనుకున్నారేమో మంత్రి కేటీఆర్ వారిని ఆపేశారు. కానీ నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

https://youtu.be/cgdj0iRoogA