ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన..హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి

0
95

టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌ బృందం ఈ నెల 18 వ తేదీన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకొని 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. కాసేపటి క్రితమే హైదరాబాద్‌ చేరుకున్నారు మంత్రి. అక్కడ వివిధ కంపెనీల అధిపుతలతో చర్చలు జరిపి సఫలం అయ్యారు.

ఫార్మా, లైఫ్‌ సెన్సెస్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్‌, ఫిష్‌ ప్రాసెసింగ్, ఐటీ కంపెనీలు రాష్ట్రంలో రూ. 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.న్యూయార్క్‌ లోని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ రూ.1750 కోట్లతో హైదరాబాద్‌ లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ముందుకొచ్చింది.

అదే విధంగా న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్లాక్‌ ఫార్మా సంస్థ సీఈవో అజయ్‌ సింగ్‌ రూ.150 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. చివరి రోజు పర్యటనలో తెలంగాణలో 4 సంస్థలు పెట్టుబడి పెట్టటానికి సంసిధ్దత వ్యక్తం చేశాయి.ఇక మంత్రి కేటీఆర్‌ తిరుగు ప్రయాణం వస్తున్న సమయంలో  టీఆర్‌ఎస్‌ నేతలు ఎయిర్‌ పోర్టులో హల్ చల్ చేశారు.