మహేష్ బాబుకి బర్త్‌డే విషెస్ అందించిన కేటీఆర్

మహేష్ బాబుకి బర్త్‌డే విషెస్ అందించిన కేటీఆర్

0
118

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్ట్ 9,2019న 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బర్త్ డే సందర్భంగా కొన్ని చోట్ల రక్తదానాలు, అన్నదానాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే కొద్ది సేపటి క్రితం మహేష్‌కి తన ట్విట్టర్ ద్వారా బిలేటెడ్ బర్త్ డే విషెస్ అందించారు కేటీఆర్‌. తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో విజన్ ఫర్ బెటర్ టుమారో అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ ఒకే వేదికపై పాల్గొన్న సంగతి తెలిసిందే.