కర్నూల్ జిల్లాలో మరో టీడీపీ వికెట్ ఔట్…

కర్నూల్ జిల్లాలో మరో టీడీపీ వికెట్ ఔట్...

0
99

స్థానిక సంస్థల ఎన్నికల వేల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి… తమ రాజకీయ దృష్ట్య టీడీపీ నేతలు ఉన్నఫలితంగా సైకిల్ దిగి వైసీపీ తీర్ధం తీసుకుంటున్నారు.. ఇప్పటికే డొక్కా, రెహమాన్, కరణం బలరాం, రామసుబ్బారెడ్డి వంటివారు వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…

ఇక మరి కొందరు టీడీపీకి రాజీనామా చేసి తమ అనుచరులతో చర్చించిన తర్వాత మీడియాకు చెబుతామని అంటున్నారు… అయితే ఇదే క్రమంలో వైసీపీ కంచుకోట కర్నూల్ జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది… నందికొట్కూరు టీడీపీ ఇంచార్జ్ ఐజయ్య వైసీపీ తీర్థం తీసుకున్నారు…

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ దక్కకపోవడంతో టీడీపీ తీర్థం తీసుకుని పోటీ చేసి ఆర్థర్ చేతిలో ఓటమి చెందారు… ఇక అప్పటినుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు…