కర్నూలు వైసీపీలో ఆ కీలక పదవి కోసం ఇద్దరి పేర్లు తెరపైకి

కర్నూలు వైసీపీలో ఆ కీలక పదవి కోసం ఇద్దరి పేర్లు తెరపైకి

0
119

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు, అంతేకాదు పలు సంక్షేమపథకాలతో ప్రజల గుండెల్లో నిలుస్తున్నారు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటికి నేరుగా అందచేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పార్టీకోసం ఎంతో కాలంగా కష్టపడిన నేతలు కూడా పదవుల కోసం చూస్తున్నారు.

ఈ సమయంలో పదవులని పార్టీలో ఉన్న కీలక నేతలకు ఇస్తున్నారు సీఎం జగన్ ,తాజాగా స్ధానిక సంస్ధల సమయం ఇది, ఇక కరోనా ప్రభావం తగ్గాక ఈఎన్నికలు జరిగే అవకాశం ఉంది, ఈ సమయంలో ఎవరికి వారు టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్నారు.

ఈ సమయంలో కర్నూలు జిల్లాలో మాజీ ఎంపీ బుట్టారేణుకకి కర్నూలు మేయర్ పదవి వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఈ పదవి కోసం రేసులో చాలా మంది ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుటుంబం కూడా ఈ పదవి పై కన్నేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఆయన భార్యకు ఈ పదవి రావాలి అని చూస్తున్నారట, ఇక జిల్లాలో కొందరు కీలక నేతలు తమ వారికి సీటు కోసం చూస్తున్నారట, మరి సీఎం జగన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఎన్నికల వేళ చూడాలి.

.