భార్యకు కరోనా వచ్చిందని ఆమె భర్త ఏం చేశాడో చూడండి

Husband taking his Covid positive WIFE to quarantine centre in Mizoram

0
115

ఇప్పుడు ఎక్కడ చూసినా కోవిడ్ గురించే చర్చ, ఇక్కడ అక్కడ అని లేదు అన్నీ స్టేట్స్ లో కేసులు భారీగా వస్తున్నాయి. అయితే కొన్ని కుటుంబాల్లో ఒకరికి కరోనా వస్తే మరికొన్ని కుటుంబాల్లో అందరూ కరోనా భారిన పడుతున్నారు..ఓ వ్యక్తి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన తన భార్యను ఐసోలేషన్ సెంటర్ కు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎందుకు అనుకుంటున్నారా ఇతను చేసిన పనికి కొందరు కామెంట్లు భారీగా పెడుతున్నారు, కొందరు పాజిటీవ్ గా స్పందిస్తే మరికొందరు ఇదేం పద్దతి అని ప్రశ్నిస్తున్నారు.మిజోరాంకు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వెంటనే ఆమెని ఐసోలేషన్ సెంటర్ కు  తరలించాల్సి వచ్చింది. అయితే ఆమెని కారులో కూర్చొబెట్టుకుని తీసుకువెళితే ఇబ్బంది అని ఆలోచించి భర్త మెదడుకు పదును పెట్టాడు.

అతని జీపుకు వెనకాల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమెను ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి.. ఐసోలేషన్ సెంటర్ కు తరలించాడు. దీంతో చాలా మంది మరీ ఇలా తీసుకువెళ్లాలా ఏమైనా వెహికల్ మాట్లాడి తీసుకువెళ్లవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు.

మీరు ఆ వీడియో చూసేయండి

https://twitter.com/rupin1992/status/1399289941780094993