చంద్రబాబుకి లగడపాటి గుడ్ న్యూస్

చంద్రబాబుకి లగడపాటి గుడ్ న్యూస్

0
111

ఈసారి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా ఫలితాలకు మాత్రం చాలా సమయం ఉంది.. ఈసారి ఎవరు గెలుస్తారు అధికారం ఎవరు చేపడతారు అని సర్వేలు చూసి తెలుసుకుందాం అంటే అన్నీ జగన్ గెలుస్తారు అని చెబుతున్నాయి.. అయితే ఇవన్నీ నమ్మే సర్వేలు కాదు అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. గత ఎన్నికలు అంటే 2014 ఎన్నికల్లో కూడా ఇలాగే చెప్పారు, వైసీపీ గెలుస్తుంది జగన్ సీఎం అవుతారు అని చెప్పారు, కాని వాస్తవంగా జగన్ గెలవలేదు.. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది.

ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ చెబుతున్నారు.. ఏకంగా 120 నుంచి 130 సీట్లు వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు, అందుకే ఈ సర్వేలు నమ్మేలా లేవు అని చెబుతున్నారు పార్ట నేతలు. పైగా పీకే సర్వేలు నమ్ముకుంటే అంతే అని కూడా చెబుతున్నారు.. ఉత్తరాధి ప్రశ్నలు ఇక్కడ సమాధానాలు పొంతన ఉండవు అని, అక్కడ రాజకీయాలు వేరు ఇక్కడ రాజకీయాలు వేరు అని చెబుతున్నారు.. ఇక్కడ జగన్ ని, చంద్రబాబుని ఓటర్లు ఎలా చూస్తారో, పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్దులను కూడా జనాలు చూసి వారి ఆలోచన ప్రకారం ఓట్లు వేస్తారు అని చెబుతున్నారు.

ఇక తాజాగా మే 19 న అన్ని జాతీయ మీడియాలు తమ సర్వేలు విడుదల చేస్తాయి.. ఎగ్జిట్ పోల్స్ ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల అవుతాయి. ఆ సమయంలో ఎవరు గెలుస్తారు అనేది ఎడ్జ్ గా చెప్పవచ్చు.. అయితే ఈసారి లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వే రిపోర్టు ఆరోజు చెప్పనున్నారు అని తెలుస్తోంది.. మీడియా సమావేశం పెట్టి ఆయన చెప్పనున్నారు… అయితే ఆయన తన సర్వేలో తెలుగుదేశం తక్కువ స్ధానాలు గెలుస్తుంది అని తెలుసుకున్నారట… ఎందుకు అంటే పోలీంగ్ తర్వాత కూడా పలు చోట్ల శాంపిల్ సర్వేలు చేశారట ..అన్నీ కూడా చంద్రబాబుకు పాజిటీవ్ గా రిజల్ట్ ఇచ్చాయట. అందుకే ఆయన గెలుపు పక్కా అని చెబుతున్నారు ఇక్కడ పార్టీ నేతలు… ఇటు మే 19 న లగడపాటి నోటి వెంట మీరే ఆమాటలు వింటారు అని చెబుతున్నారు.