జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు అంటే కచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉండాలి… లేకపోతే ఆర్దిక సమస్యలు చాలా చుట్టుముడతాయి, అందుకే ఆర్దికంగా బలంగాఉన్న వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొంటారు, అయితే సంపద ఉండాలి అంటే ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు పండితులు, ఇంట్లో భర్త ఎంత ఉద్యోగం వ్యాపారం చేస్తున్నా కలిసి రావడం లేదు అంటే ఇంటిలో ఉన్న పరిస్దితులు కూడా కారణం అవుతాయి.
ముఖ్యంగా లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండకపోతే ఎక్కడా రాణింపు ఉండదు, అయితే ఇంట్లో ధనం నిలవాలి అంటే
లక్ష్మీదేవి ప్రీతి చెందే పనులు చేయవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిత్యం పూజ చేసుకోవాలి భర్త చేసే పూజ వల్ల ఇంట్లో ఎంతో మంచి జరుగుతుంది.
ఉదయం దేవాలయానికి వెళ్లి పూజ చేసుకోవడం ఎంతో మంచిది.. ఉదయం 7 లేదా 8 వరకూ నిద్ర పోకూడదు కచ్చితంగా మహిళ తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి పూజ చేసుకోవాలి.. ఇక ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి.
పూజా మందిరంలో దీపం పెట్టేవారి ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. పెరట్లో అరటి చెట్టు తులసి మొక్క కనిపిస్తే కచ్చితంగా లక్ష్మీ దేవి కృప ఉంటుంది అంటున్నారు పండితులు.