సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో నిన్నటి నుంచి జనసేన పార్టీ నాయకులు షాక్ అవుతున్నారు, అసలు ఆయన పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు అనే విషయంలో ఇప్పటికి ఓ డైలమా నాయకుల్లో కనిపిస్తోంది, ముఖ్యంగా విశాఖలో ఇది మరీ ఎక్కువగా ఉంది.
అయితే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడంపై పవన్ కల్యాణ్ స్పందించారు, ఆయన నిర్ణయం గౌరవిస్తున్నాము అని తెలిపారు, అలాగే కౌంటర్ కూడా ఇచ్చారు పవన్ ..
తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లేవని. అత్యధిక జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగినీ కానని స్పష్టం చేశారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని వివరించారు. తాను సినిమాలు అందుకే చేస్తున్నా అని, మీరు ఆ విషయాలు పేర్కొని ఉంటే బాగుండేది అని పవన్ ఓ లేఖలో తెలియచేశారు.
తన కుటుంబం కోసం, పార్టీని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తాను సినిమాలు చేయక తప్పదని పవన్ స్పష్టం చేశారు. మీపై గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని తెలిపారు పవన్ కల్యాణ్.