కరోనా సమయంలో ప్రతీ ఒక్కరు భయపడుతున్నారు.. అడుగు బయటపెట్టడానికి జంకుతున్నారు, అయితే ఈ సమయంలో బ్రహ్మంగారు చెప్పిన మాటలు బాల బ్రహ్మం మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి, అయితే తాజాగా తెలంగాణలో కూడా ఓ మాట తెగ చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల్లో రంగం కార్యక్రమం ఉంటుంది అందులో జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తుంది. అందరూ ఈ రంగం చూసేందుకు వస్తారు, అమ్మవారి మాటలు వింటారు, ఈ రాష్ట్రం దేశం ఎలా ఉంటుంది అనేది ఆమె చెబుతారు.
గతంలో ఆమె భవిష్యవాణిని వినిపిస్తూ.. దేశంలో విపత్కర సమయంలో ప్రతి ఇంటి నుంచి గండ దీపం రావాలని, ఆ వెలుగులో ఎంతటి దుష్టశక్తిని అయినా అమ్మవారు పారద్రోలుతుందని చెప్పింది. అయితే ఇప్పుడు ఏడాదిలోపే ఇలా ద్వీపాలు వెలిగించారు దేశ ప్రజలు, మోదీ పిలుపు నిచ్చారు, దీంతో ముందే అమ్మవారు ఇలా రంగంలో ఈ విషయం చెప్పారు అని ప్రతీ ఒక్కరు నమ్ముతున్నారు.