ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ మహమ్మాకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది… 24 గంటలూ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధిని ఎలా అరికట్టాలి ఆ మహమ్మారి విరుగుడుకు ముందు ఎలా కనిపెట్టాలి అని ప్రపంచ దేశాలప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి… భారతదేశ ఐటీ బీటీ దేశా రాజధాని సిలికాన్ సిటీ బెంగాళూరులో ప్రపంచంలోని అతిపెద్ద అత్యాధునిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు..
బెంగుళూరు ముంబై జాతీయ రహదారిలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో 10,100 పడక గదుల కరోనా వైరస్ అఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి… ప్రతీ రోజు 24 గంటలకు కొన్ని వేళాది మంది వైద్య సిబ్బంది ఇక్కడ కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు చికిత్స చెయ్యడానికి సిద్దం అవుతోంది…
ఈ కోవిడ్ 19 చికిత్సా కేంద్రంలో అనుమానిత రోగుల మెనూ కూడా ప్రభుత్వం ఇచ్చింది… కరోనా వైరస్ భారతీయులను గజగజలాడిస్తోంది… ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో చట్టర్ పూర్ సమీపంలోని సర్దర్ వల్లభాయ్ పటేల్ ప్రాంతంలో దేశంలో అతిపెద్ద కోవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ చికిత్స కేంద్రాన్ని బెంగుళూరులో ఏర్పాటు చేస్తున్నారు…