ఈ టైటిల్ విని ఆశ్చర్యం వేసి ఉంటుంది… నిజమే ఇలాంటి కోరిక ఎవరూ ఇప్పటి వరకూ కోరి ఉండరు కాని ఇప్పుడు ఇదే కోరిక కోరాడు …బ్రిటన్ హాస్య నటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీన్
తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని లండన్ జూలోని సింహాలకు ఆహారంగా వేయాలన్న కోరిక చెప్పాడు.
దీంతో అందరూ షాక్ అయ్యారు, అయితే దీని వెనుక కారణం కూడా చెప్పాడు ఓ చానల్‌కు రికీ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఈ కామెంట్ చేశాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి అతను ఈ కామెంట్ చేశాడు
తాను చనిపోయిన తర్వాత తన శరీరం ఇలా ఉపయోగపడితే చాలా ఆనందం అని తెలిపాడు..స్వేచ్ఛగా తిరిగే జంతువులను చంపి తినేస్తున్నామని, అడవులను నరికేస్తున్నామని అందుకే వాటి కోసం ఇలా చేయాలి అని తన కోరిక చెప్పాడు, అయితే దీనిపై లండన్ జూపార్క్ స్పందించింది. రికీని తినడానికి తమ జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చని సరదాగా వ్యాఖ్యానించింది. ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే విరాళాల రూపంలో ఇవ్వాలని, వాటికి మంచి ఆహారం పెడతాము అని తెలిపారు