తిరుమల శ్రీవారికి చాలా మంది వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు భారీగా కానుకలు ఇస్తారు అనేది తెలిసిందే, అంతేకాదు భారీ విరాళాలు ఆభరణాలు కూడా ఇస్తారు… తాజాగా ముంబయికి చెందిన సంజయ్ కె సింగ్ తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు… ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు, మరి ఆయన చేసింది ఏమిటి అనేది చూద్దాం.
సంజయ్ కె సింగ్ రూ.300 కోట్లతో తిరుపతిలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఈ ఆస్పత్రి నిర్మాణం మొత్తం సంజయ్ సింగ్ చేపడతారు, ఆ తర్వాత టీటీడీకీ అప్పగించనున్నారు, సుమారు దీని కోసం 300 కోట్లు ఖర్చు చేయనున్నారు, ఈ విషయం తెలిసి అందరూ మంచి నిర్ణయం అంటున్నారు.
రూ.300 కోట్ల వ్యయంతో 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తిరుపతిలో నిర్మించేందుకు సంజయ్ కె సింగ్ కు చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ టీటీడీతో ఎంవోయూ కుదుర్చుకుంది. తిరుమల తిరుపతి దేవస్ధానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో దీనికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు సంజయ్ కె సింగ్ -టీటీడీ అధికారులు …చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వల్ల చాలా మందికి మేలు చేకూరుతుంది అంటున్నారు అక్కడ ప్రజలు ఉద్యోగులు.