LIC కొత్త  బచత్ ప్లస్ ప్లాన్ గురించి తెలుసుకోండి 

-

LIC కొత్త కొత్త పాలసీలు తీసుకువస్తుంది అనేది తెలిసిందే, ఈ ప్రభుత్వ రంగ బీమా సంస్ధ ఖాతాదారులకి అనేక కొత్త పథకాలు పాలసీలు తీసుకువస్తుంది… దేశ వ్యాప్తంగా ప్రతీ చోట ఈ బ్రాంచీలు ఉన్నాయి….ఎల్ఐసీ తాజాగా బచత్ ప్లస్ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. మరి ఇది ఏమిటి అనేది చూస్తే, పాలసీ తీసుకునే వ్యక్తికి బీమా రక్షణ అంతేకాదు పొదుపు కూడా ఉంటుంది.
మొత్తం ఇది  ఐదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో వస్తుంది.. ఈ ప్లాన్లో చేరిన పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తుంది. ఒకేసారి ఐదు సంవత్సరాల పాలసీ మొత్తం నగదు అతని కుటుంబానికి చెల్లిస్తారు…  ఒకవేళ ఆ ఐదేళ్ల పాలసీ పూర్తి అయిన తర్వాత ఆ పాలసీ దారుడు మరణిస్తే.
అతని కుటుంబానికి పరిహారంతో పాటు లాయల్టీని కలిపి అందజేస్తారు. ఇక ఒకేసారి ప్రిమియం మొత్తం చెల్లించవచ్చు, లేదా మీరు వాయిదాలుగా ఐదు సంవత్సరాలు చెల్లించవచ్చు,  మరో విషయం  పాలసీదారుడు 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.  దీని గురించి మీ దగ్గరల్లో ఉన్న ఎల్ ఐసీ ఏజెంట్  లేదా ఎల్ ఐసీ ఆఫీసులో అయినా సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...