రేషన్ కార్డు అనేది చాలా మందికి ఉంటుంది.. పేద వారికి తెల్లరేషన్ కార్డు ఇస్తాయి ప్రభుత్వాలు.. ఇక దేశంలో ఎక్కడ ఉన్నా ఇప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ అమలుతో మీరు ఆ స్టేట్ లో రేషన్ తీసుకోవచ్చు, అయితే మరి తెలంగాణలో ఏపీలో ఇప్పుడు రేషన్ కార్డులు చాలా మంది అప్లై చేసుకుంటున్నారు, మరి ఎలా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం.
ఏపీలో కొత్తగా వాలంటీర్ వ్యవస్ధ ఉంది సచివాలయం ద్వారా అప్లై చేసుకుంటున్నారు…మరి తెలంగాణలో ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ తెలంగాణలో మీరు ముందుగా మీ సేవకు వెళ్లాలి.. ఇక్కడ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మీకు ఫామ్ ఇస్తారు.
ఇక ఆ ఫామ్ లో ఎంత మంది కుటుంబ సభ్యులు అనేది తెలియచేయాలి
ఉదాహరణకు మీరు ఓ కుటుంబం అంటే మీ భార్య మీరు మీ పిల్లలు పేర్లు రాస్తారు
ఇక మీ ఫోటోలు
పేరు, పుట్టిన తేదీ, వయస్సు,వివరాలు అన్నీ ఇవ్వాలి
రెసిడెన్స్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి.
మొబైల్ నెంబర్ ఇవ్వాలి
నోట్ ..
ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులతో కలిసి వేరే రేషన్ కార్డులో ఉంటే దానిలో మీ పేరు డిలీట్ చేయించుకోవాలి.. ఆ తర్వాత మీరు కొత్త కార్డు అప్లై చేసుకోవాలి అనేది మర్చిపోకండి ఇది కూడా మీ సేవలో చేస్తారు.