బీజేపీ నేతల్ని వదిలిపెట్టం: సీఎం కేసీఆర్

Leaving BJP leader: CM KCR

0
69

సీఎం కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. నిన్న ప్రెస్ మీట్ లో సీఎం లేవనెత్తిన అంశాలపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..బండి సంజయ్ చెప్పిందంతా సొల్లు పురాణం. ఢిల్లీలో 600 మంది రైతులు చనిపోతే ఢిల్లీ పెద్దలు చలించలేదు. ప్రశ్నించిన వాళ్లంతా దేశద్రోహులా. బీజేపీ ఏమైనా దేశద్రోహాల్ని తయారు చేసే ఫ్యాక్టరీనా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా..మషి పూషి మారేడు కాయ చేసుడు కాదు. తెలంగాణలో వరి పంటను కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా..సమాధానం చెప్పే దాకా బీజేపీ నేతల్ని మేం వదలం. అలాగే రైతు చట్టాల్ని సుప్రీం కోర్ట్ ఆపేసింది. కేంద్రం ఆచట్టాలను రద్దు చేస్తుందా లేదా అని వ్యాఖ్యానించారు.