కుంభ మేళా అనే మాట మనం వింటాం అయితే అసలు ఈ కుంభం అంటే ఏమిటి ఇలాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం
కుంభం అంటే ఒక భాండం అని లెక్క, ఈ భాండం గురించి జరిగే జాతర అని అర్ధం.అంటే అమృత భాండం గురించి పండుగ చేసుకోవటం. దీని వెనుక ఓ కథ ఉంది చరిత్రలో అది తెలుసుకుందాం.
ఒకప్పుడు దేవతలందరికీ వారి వారి శక్తులు అన్నీ పోయాయి. అప్పుడు వారు అసురులతో ఒక ఒప్పందానికి వచ్చారు. ఇరువురు పాల సముద్రం మథించాలి అని అనుకున్నారు, ఈ సమయంలో వచ్చే అమృతం ఇద్దరు సమానంగా తీసుకోవాలి అని అనుకున్నారు, కాని ఇలా గొడవపడుతూ ఒప్పందానికి రాక ఏకంగా 12 ఏళ్లు గొడవపడ్డారు.
ఇంతలో దేవ పక్షి అయిన గరుడుడు ఈ అమృత భాండాన్ని తీసుకు వెళ్ళిపోతాడు…ఆ సమయంలో అందులో ఉన్న కొన్నిచుక్కలు ఈ భూమి మీద నాలుగు ప్రాంతాల్లో పడతాయి… అక్కడే వరుసగా ఇప్పుడు కుంభమేళా జరుపుకుంటున్నాం.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ,
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్
మహా రాష్ట్ర లోని నాసిక్
మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని దగ్గర జరుపుకుంటాం.