నేడు బంగారం ధర సాధారణంగా ఉంది.. మార్కెట్లో పెరుగుదల తగ్గుదల ఏమీ లేదు.. సాధారణంగా ట్రేడ్ అవుతోంది, మరి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర నార్మల్ గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం రేటు రూ.48,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సాధారణంగా ఉంది రూ.44,250 దగ్గర ట్రేడ్ ఉంది….ఇక విజయవాడ విశాఖ వరంగల్ హన్మకొండ ఆదిలాబాద్ ఇలాంటి ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇదే రేటుకి ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర చూశాం, మరి వెండి రేటు చూస్తే, వెండి రేటు మాత్రం పెరిగింది. వెండి ధర రూ.600 పెరిగింది. దీంతో రేటు రూ.73,900కు చేరింది.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.