ఈ ఏడాది 2021 సింహ రాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం.. 2021 సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.
ఆఫీసులో మీకు ప్రమోషన్ లభిస్తుంది… వ్యాపారస్తులకి ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు.
మీ ఖర్చులలో ఊహించని పెరుగుదల మీ ఆర్థిక పరిస్థితులను కాస్త తగ్గిస్తుంది, ప్రేమ విషయంలో ఎదురు దెబ్బలు తప్పవు, కుటుంబంలో ఓ వివాహం జరుగుతుంది ఇంట్లో అక్క చెల్లె తమ్ముడు అన్నల విషయంలో శుభకార్యం జరుగుతుంది.
ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఇక వివాహం విషయంలో వెనక్కి వెళుతున్న సంబంధాలు ఈ ఏడాది మీకు పెళ్లి అయ్యే అవకాశం ఉంది, సొంత ఇంటి నిర్మాణం కూడా కనిపిస్తోంది, కొందరు స్ధలం అయినా కొనుగోలు చేస్తారు. మీ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది.
ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఆమెను మళ్లీ బాధపెట్టే అవకాశము ఉంది. ఇక కోర్టు వ్యవహారాల్లో మీకు మంచి జరుగుతుంది, అలాగే రైతులకి మంచి లాభాలు ఉన్నాయి, మెటల్ ఫార్మా కంపెనీల ఓనర్లకు లాభాలు కనిపిస్తున్నాయి, హోల్ సెల్ వ్యాపారులకి ఈ ఏడాది అంత ప్రభావం చూపించడం లేదు…ఆగస్ట్ నుంచి మీకు ప్రభుత్వ ఉద్యోగాలు విదేశీయానం కనిపిస్తుంది
ఇక లవర్స్ పెళ్లి కోసం చూస్తున్న వారు తెగిస్తారు ఇంట్లో ఒప్పించి మూడు ముళ్లతో ఒకటి అవుతారు. ఈ రాశివారికి కీళ్ల నొప్పులు, మధుమేహం ఇబ్బంది పెడుతుంది.


