ఈ ఏడాది 2021 తులా రాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం..ఈ ఏడాది మీకు మంచి జరుగుతుంది. ఆఫీసుల్లో మీ పని వల్ల మీకు మంచి మార్కులు పడతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.. ఈ ఏడాది మీరు టూర్లు ఎక్కువ తిరుగుతారు… విదేశీ ప్రయాణం కూడా కనిపిస్తోంది.
మార్చి నెల నుంచి పట్టిందల్లా బంగారమే, ఇక పిల్లల విషయంలో గుడ్ న్యూస్ వింటారు…విజయం సంతోషం మీ పక్కనే ఉంటాయి.. సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినిపిస్తుంది, ఆస్తి తగాదాలు తీరతాయి, ఇంటి యజమాని దూర ప్రయాణాల్లో ఆకస్మిక ధనలాభం పొందుతారు, భార్య నుంచి ఓ ఆస్తి మీకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది.
పెట్టుబడుల ద్వారా మీ ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి.. ఇంటిలో అక్క బావ లేదా మీ కంటే పెద్దవాడు అయిన అన్నయ్య నుంచి మీకు సహాకారం ఉంటుంది..సోదరీ, సోదరులతో గొడవలు సమసిపోయి కలిసి పోతారు.ఆగస్టు తర్వాత ఆస్తి లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి…దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.. ఇంట్లో శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు.మీ కుమార్తె వివాహం లేదా రజస్వల వేడుకలు ఘనంగా చేస్తారు, బంగారం ఐటీ మెటల్ వ్యాపారులు స్టాక్స్ రంగంలో మీకు లాభాలు వస్తాయి.