లిక్కర్ కింగ్ విజయమాల్యాకు షాక్

లిక్కర్ కింగ్ విజయమాల్యాకు షాక్

0
89

మన దేశంలో బ్యాంకులకు తీసుకున్న లోన్ డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన వారిలో ముందు చెప్పుకుంటే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పేరు గుర్తు వస్తుంది తప్పించుకునేందుకు అనేక లొసుగులని లా లో వాడుతున్నారు విజయ్ మాల్యా ..కాని ఆయను తాజాగా కోర్టు షాక్ ఇచ్చింది.. విజయ్ మాల్యా ఆస్తులు వేలం వేయాలని ఆదేశించింది. బ్యాంకులకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ఈ బిజినెస్ మ్యాన్ ఆస్తుల విలువ దాదాపు 13 వేల కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

బ్యాంకులు కూడా ఆస్తులు అమ్మి తమకు రీ పేమెంట్ చేయాలి అని కోరుతున్నాయి, దీనిపై వడ్డీలకు వడ్డీలు చూసుకున్నా భారీగానే పెరుగుతోంది. ఇలా బ్యాంకులకు నగదు చెల్లించకుండా విజయ్ మాల్యా 2016 మార్చిలో లండనకు పారిపోయాడు.2017లో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. కాని అతని ఆస్తులు అమ్మకుండా మన ప్రభుత్వం మాల్యా ఆస్తులను జప్తు చేసింది.

ఎస్ బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కోర్టును ఆశ్రయించి తమకు మాల్యా చెల్లించాల్సిన నగదు చెల్లించాలి అని బ్యాంకులు అన్నీ కోర్టుకు వెళ్లాయి, అతని ఆస్తులు వేలంవేసి తమ అప్పులకు జమ చేయాలని కోరారు.అయితే జనవరి 18 తర్వాత వేలం వేయాలని ఆదేశిస్తూ, ఈలోగా బొంబాయి కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం మాల్యాకు ఇచ్చింది కోర్టు. మరి మాల్యా ఏం చేస్తారో చూడాలి.