హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలన్ని కులాల వారీగా ఓటర్లపై దృష్టి సారించింది. ఇప్పటివరకు పార్టీల మధ్యే నడిచిన వార్ ఇప్పుడు కులాల వారీగా ఓటర్లను విభజించి ఆయా సామాజికవర్గాల నేతలకు అప్పగించి ఓట్లు గంపగుత్తగా రాబట్టుకోవాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ దళితుల కోసం ‘దళితబంధు’ పథకాన్ని తీసుకొచ్చింది.
అలాగే అగ్రకులాల వారి ఓట్ల కోసం కోసం రెడ్డి సంఘంతో చర్చలు కూడా చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలనే టీఆర్ఎస్ పావులు కదుపుతుండగా అందుకు తగ్గట్టుగానే ప్రతి ఓటర్ ను కలిసి ప్రచారం విస్తృతం చేస్తున్నారు. హుజురాబాద్ కులాల వారీగా ఓటర్ల సంఖ్య ఓ సారి చూద్దాం.
రెడ్డి – 22,600
మున్నూర్ కాపు -29,100
పద్మశాలి – 26,350
గౌడ్ – 24,200
ముదిరాజ్ – 23,220
యాదవ్ – 22,150
రాజక – 7,600
నాయి బ్రాహ్మణ – 3,300
మాదిగ – 42,600
మాల- 11,100
ఎస్టీలు – 4,220
మైనారిటీలు – 5,100
ఇతరులు – 12,050 గా ఉన్నారు.