కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, అసలు అలాంటి ప్రమాదాలకు అక్కడ ఆస్కారం ఉండదు అని అనుకుంటాం… కాని అక్కడ కూడా ఇలా ప్రమాదం జరిగిన సంఘటనలు ఉంటాయి.. మీడియా ఛానల్స్ లో డిబేట్లు జరుగుతూ ఉంటాయి.. ఈ సమయంలో చాలా మంది చర్చా గోష్టిలో పాల్గొంటారు ..ఈ సమయంలో అక్కడ అన్నీ ఏర్పాట్లు చేస్తారు కుర్చీలో కూర్చుని కెమరా ముందు లైవ్ లో మాట్లాడుతూ ఉంటారు.
అయితే హఠాత్తుగా ఇలా చర్చ జరుగుతున్న వేళ ..కొలంబియాలోమీ ఈఎస్ పీఎన్ బ్రాడ్కాస్ట్ స్టూడియోలో ఓ విచిత్రం జరిగింది. హఠాత్తుగా స్టూడియో సెట్ ఒకటి ప్రజెంటర్ కార్లోస్ ఆర్డెజ్ పై పడింది. ఇలా జరగడంతో ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి, వెంటనే ఆయనని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఫుట్ బాల్ మ్యాచ్ పై జరిగిన ఈ గోష్టిలో పాల్గొన్నారు ఆయన..సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అయింది.ముక్కుకు మాత్రం స్పల్ప గాయమైందని కార్లోస్ ఆ తరువాత ట్వీట్ చేశారు.
ఈ వీడియో మీరు చూడండి