బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌పై విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ గెలుపొందారు. దీంతో ఆమె ఆ దేశ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కన్జర్వేటివ్ రేసులో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు పోలయ్యాయి. ఇక మన రిషి సునాక్‌కు 60,399 ఓట్లు పడ్డాయి. మొత్తం ఎలక్టరేట్ సంఖ్య 172,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేపర్లను తిరస్కరించారు.