తెలంగాణలోని కొత్తపల్లి జిల్లా ఏలూరు ద్వారకాతిరుమల మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు ఉదయం వైసిపి పార్టీ కార్యకర్త గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురికావడంతో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చడానికి అక్కడికి వెళ్ళాడు.
గ్రామంలోని ప్రసాద్ వ్యతిరేక వర్గమే ఆయనను హత్య చేయించిందని అతడి వర్గీయులు అనుమానించడంతో పాటు ఆ వ్యతిరేక వర్గాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రోత్సహించారని కూడా అనుమాన పడుతున్న సమయంలో ఎమ్మెల్యే ను అక్కడ చూడడంతో వ్యతిరేక వర్గీయులు రెచ్చిపోయి ఒక్కసారిగా ఎమ్మెల్యేపై దాడి చేసారు.
ఈ క్రమంలో తలారి వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఆపే క్రమంలో పోలీసులపై కూడా గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఒక గ్రామస్తుడుకి చెయ్యి కూడా విరిగిపోవడంతో చుట్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..