లాక్ డౌన్ ఎత్తేసినా అక్క‌డ ఈ నిషేధం విధించారు ఈ ప‌నులు చేయ‌కూడ‌దు

లాక్ డౌన్ ఎత్తేసినా అక్క‌డ ఈ నిషేధం విధించారు ఈ ప‌నులు చేయ‌కూడ‌దు

0
100

ఇటీవ‌ల చైనాలో వైర‌స్ కాస్త ప్ర‌భావం త‌గ్గింది, అయితే వుహ‌న్ లో కాస్త త‌గ్గినా మ‌ళ్లీ మ‌రో సిటీపై దాని ప్ర‌భావం చూపిస్తోంది.హార్బిన్ సిటిలో కూడా చాలా మంది జ‌నాభా ఉండే సిటీ, ఇక్క‌డ కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు అధికారులు, ఇక్క‌డ కూడా ఈ వైర‌స్ మ‌ళ్లీ ప్ర‌బ‌లుతోంది, అయితే ఇక్క‌డ లాక్ డౌన్ తాజాగా అమ‌లు చేస్తున్నారు.

ఈ సిటీ నుంచి ఎవ‌రిని బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు. హార్బిన్ లోని అన్ని కమ్యూనిటీలు, గ్రామాల ఎంట్రన్స్ లో గార్డులను పెట్టారు. లోనికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ప్రజలు హెల్త్ కోడ్ చూపించాల్సి ఉంటుంది. ఇక చేతికి వ్యాపారులు గ్లౌజులు వేసుకోవాలి, కేవ‌లం రెండు గంట‌లు మాత్ర‌మే స‌రుకులు పాల‌కి స‌మ‌యం ఇచ్చారు.

అంద‌రూ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేక‌పోతే ఫైన్ , జైలు శిక్ష విధిస్తున్నారు. మ‌ళ్లీ తిరిగి ఆ ఏరియాలోకి రానివ్వ‌రు. రెడ్ బ్యాన్ స్టాంప్ వారికి అంటిస్తున్నారు…అలాగే టెంపరేచర్ చెక్ చేస్తారు. బయటి వ్యక్తులకు మాత్రం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు.పెళ్లిళ్లు అంతిమ‌సంస్కారాలు విందులు, స‌భ‌లు స‌మావేశాలు, ఫంక్ష‌న్లు బ‌ర్త్ డే వేడుక‌లు ఏమీ కూడా నిర్వ‌హించ‌కూడ‌దు.