లాక్ డౌన్ తర్వాత కేంద్రం నిర్ణయం అదేనా…

లాక్ డౌన్ తర్వాత కేంద్రం నిర్ణయం అదేనా...

0
91

కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది… ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరాయి.. ఇక మరికొన్ని రాష్ట్రలు ఈరోజు తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి…

కరోనా కేసులు 5 వేలు దాటడంతో కేంద్రం కూడా లాక్ డౌన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది… అత్యవసర వస్తువులకు కొరత లేకుండా చాడాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు…

దీన్ని బట్టి మరికొన్ని వారాలపాటు లాక్ డౌన్ కంటిన్యూ చేసే సూచనలే కనిపిస్తున్నాయి.. ఏప్రెల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగింపు దిశగా కేంద్రం ఆలోచిస్తోందన్నారు మంత్రి కిషన్ రెడ్డి కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయని అన్నారు.. దీనిగురించి కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు..