లాక్ డౌన్ త‌ర్వాత ఇవి పాటించాల్సిందే లేక‌పోతే కేసులే

లాక్ డౌన్ త‌ర్వాత ఇవి పాటించాల్సిందే లేక‌పోతే కేసులే

0
118

మ‌న దేశంలో రెండో ద‌శ లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, ఇక మే 3 వ‌ర‌కూ ఈ లాక్ డౌన్ కొన‌సాగుతుంది, అయితే కొన్ని స్టేట్స్ మాత్రం ఇంకా లాక్ డౌన్ మ‌రికొన్ని రోజులు పొడిగించాలి అని చూస్తున్నారు, మ‌హ‌రాష్ట్ర పంజాబ్ అదే ఆలోచ‌న చేస్తున్నాయి, ఇప్ప‌టిక పంజాబ్ ప్ర‌క‌టించింది.. ఇక వెస్ట్ బెంగాల్ లో కూడా మ‌రో ప‌ది రోజులు పెంచాలి అని భావిస్తున్నారు.

ఇక తెలంగాణ‌లో మే 7 వ‌ర‌కూ ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది అని తెలిపారు. ఇక దేశంలో లాక్ డౌన్ కు కాస్త సడలింపులు ఇచ్చిన తర్వాత ముఖానికి మాస్కులు లేకుండా.. ఫేస్ కవర్లను ధరించకుండా రోడ్ల మీదకు వస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

క‌చ్చితంగా మాస్క్ లు ధ‌రించాల్సిందే, ఎవ‌రైనా మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే మాస్క్ లేక‌పోతే ఇక కేసులు పెడ‌తారు బండిమీద హెల్మెట్ పెట్టుకున్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే, క‌చ్చితంగా వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి …మ‌నిషి సామాజిక దూరం పాటించాలి, ఇవి పాటించ‌క‌పోతే కేసులు న‌మోదు చేస్తారు లేక‌పోతే మ‌రిన్ని కేసులు పెరుగుతాయి అని భావిస్తున్నారు.