లాక్ డౌన్ ఎత్తివేస్తే ఎలాంటి చర్యలు చేపడతారు?

లాక్ డౌన్ ఎత్తివేస్తే ఎలాంటి చర్యలు చేపడతారు?

0
92

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది, ఎవరూ వ్యాపారాలు షాపులు అప్పటి వరకూ తీయడానికి లేదు, అయితే లాక్ డౌన్ వేళ దేశంలో దారుణమైన ఆర్దిక అనిశ్చితి వచ్చింది, ఎవరి దగ్గర నగదు లేదు, అయితే కరోనా వైరస్ మరింత ప్రబలుతోంది కాబట్టి కొందరు లాక్ డౌన్ పొడిగించాలి అని కోరుతున్నారు.

మరికొందరు కొన్ని ఆంక్షలు విధించి సడలించాలి అని చెబుతున్నారు, తాజాగా ప్రధాని కూడా
లాక్డౌన్ను సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రులకు తెలిపారు.
కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలకు వర్తించేలా ఆ కార్యాచరణ ఉండాలని మోదీ దిశానిర్దేశం చేశారు.

దీని బట్టి చూస్తే రైల్వేకనెక్టివిటీ దేశం అంతా ఉంటుంది… ఇలాంటి సమయంలో వాటిని నడిపే ఆలోచన విరమించాలి అని అంటున్నారు, బస్సులు కూడా లోకల్ ట్రాన్స్ పోర్ట్ కల్పించేలా ఉండాలి అని కోరుతున్నారు, ఇక సరిహద్దు చెక్ పోస్టులు కూడా క్లోజ్ చేయాలి అని చాలా మంది కోరుతున్నారట, ఇలా చేస్తే ఎక్కడ వారు అక్కడ ఉండి పనులు చేసుకోవచ్చు.. ప్రాంతాలు మారరు కాబట్టి కచ్చితంగా వైరస్ వ్యాప్తి ఆగుతుంది అని మేధావి వర్గం చెబుతోంది.