దేశంలో మే 17 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది, అయితే ఈ సమయంలో గ్రీన్ జోన్లో ఉన్న వాటికి మాత్రమే కాస్త సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం.. ఆరెంజ్ జోన్లో ఉన్న వారికి కూడా కొన్ని ఆంక్షలు విధించింది సడలింపులు ఇచ్చింది, మరి ఈ సమయంలో మద్యం పాన్ షాపులు కూడా కేవలం గ్రీన్ జోన్ లో మాత్రమే తెరచుకోవాలి.
అయితే ఎట్టి పరిస్దితిలో ఇవి మాత్రం తెరవకూడదు అని తెలిపింది కేంద్రం, సినిమా హాల్స్, స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ , క్లబ్స్ , పబ్స్ , బార్లు, ప్రార్ధన ఆలయాలు, సభలు, సమావేశాలు, గెట్ టు గెదర్ పార్టీలు, పార్కులు, పెద్ద పెద్ద ఆఫీసులు.
స్పోర్ట్ క్లబ్స్, కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్ లు, హోటల్స్, టీ దుకాణాలు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు,రైళ్లు మెట్రో రైళ్లు, విమానప్రయాణాలు ఉండవు, ఇవి ఎట్టి పరిస్దితిలో తీయకూడదు. కిరాణా, కూరగాయలు, మిల్క్ డెయరీలు ,ఇలాంటి షాపులకి అనుమతి ఉంది అవి కూడా ఉదయం ఏడు నుంచి రాత్రి 7 వరకూ మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.